చేతులతో పాలు పితుకు పద్ధతులు: వాటిని పరిశుభ్రం గా ఎలా వుంచాలి

చేతులతో పాలు పితకటము “పాలు తీయు యంత్రము”తో తీసినంత పరిశుభ్రముగా మరియు ఇంకా సున్నితముగా తీయవచ్చును .కాని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చేతులతో తీయునప్పుడు కొన్ని మెళుకువలు పాటించి నట్లయితే ఆవులు కొంత ఎక్కువ పాలు ఇస్తాయి.పరిశుభ్రమైన పాల ఉత్పాదనకు కొన్ని సూచనలు.

  • పాలు పితుకు మనిషి పరిశుభ్రంగా,ఆరోగ్యవంతంగా ఎలాంటి అంటు వ్యాధులు కలిగి వుండరాదు .
  • ఆవు వెనుక భాగము ఎలాంటి మట్టి , పేడ లేకుండా శుభ్రంగా వుండాలి.
  • ఆవులను శరీరము పైన వున్న వదులైన వెంట్రుకలు,మట్టి , పాలు తీయునప్పుడు పాత్రలలో పడకుండా అరికట్టుటకు ప్రతి నిత్యము ద్రువ్వు చుండాలి.
  • పొదుగు వాపు లాంటి జబ్బులు యేమైనా వున్నాయా అని గమనించాలి.
  • పాలు ప్రతి రోజు ఒక నిర్ణీత సమయంలో తీయాలి, వీలై నంత వరకు 12 గంటల వ్యవధిలో, ప్రతిరోజూ ఒకే మనిషి తీయాలి.
  • ఈ విధముగా అనుసరించి తే ఆవులు ఒక పద్ధతికి అలవాటు పడి ,ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా లాభదాయక మైన పాల ఉత్పాదన చేపట్టవచ్చును.
  • పాలు తీయునపుడు ప శుశాలలో ఎలాంటి అనవసరమైన శబ్దాలు లేనట్లయితే పాల ఉత్పాదన మీద ప్రతికూల ప్రభావము వుండదు.
  • మొదట వచ్చు పాల ధారలను పొదుగు వాపు లాంటి వ్యాధులకు పరీక్షించాలి( ఎలా చేయాలి అనుటకు మీ పశువైద్య అధికారిని సంప్రదించండి)
  • తోక పదేపదే ఊపకుండా , తోకను, వెనుక కాళ్ళను బంధించి వుంచాలి .
  • నీటి ధారతో పొదుగును,వెనుక కాళ్ళను శుభ్రము చేయండి.పొదుగు శుభ్రము అయిన తరువాత ఒక నిమిషం పాటు మర్దనా చేయాలి.వస్త్రంతో పొదుగు శుభ్రము చేయకూడదు. అప రిశుభ్రమైన వస్త్రమైతే పొదుగు వాపు లాంటి ఇబ్బందులకు గురి కావచ్చును.
  • చేతులను పాలు తీయుటకు ముందు పరిశుభ్రం చేసుకోవాలి.చేతులు తడిగా వుండాలి కాని నీరు కార కూడదు.
    మీ చేతులను పాలలో ముంచరాదు. అలా చేస్తే మీ చేతుల ద్వారా జబ్బులు వ్యాప్తి చెందే ప్రమాదం వుంది
  • పాలు తీయుటకు సన్నులకు ఎలాంటి జారుడు పదార్థములు వాడరాదు. అవసరమైతే పాలు పితికే సాల్వే లను వాడాలి.
  • అయిదు నుండి యేడు నిమిషాల లోపు పాలు పితుకుట పూర్తి చేయాలి.ఆ లస్యమయితే ఆవు పాలు ఇచ్చుట నిలిపివేస్తుంది
  • పాలను ఒక మెటల్ స్త్రైనర్ తో లేదా ఒక శుభ్రమైన వస్త్రంతో కాని పాల పాత్ర లోనికి వడియకట్టాలి.
  • పాలు ఒలికి పోకుండా వస్త్రాన్ని పాత్రకు బిగించి కట్టాలి.
  • పాలు తీసిన తర్వాత పాలుంచిన పాత్రను చల్లని ప్రదేశములో వుంచాలి.
  • పాలు తీసిన తర్వాత దూడ తల్లితో పాలు త్రాగ నట్లయితే ,సన్నులను మందులు కలిపిన కప్పులలో ముంచాలి.
  • పాలు తీయు మనిషికి ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్ష చేయించాలి.
  • వివిధ రకములైన “పాలు పితుకు యంత్రములు” ఇండియా మరియు విదేశాలలో లభిస్తున్నాయి.

డా. కె. ఆర్ సింఘాల్

పశుసంవర్ధక మాజీ ప్రాంతీయ జాయింట్ కమిషనర్,
మహారాష్ట్ర రాష్ట్రం, భారతదేశం.
ఈమైల్: drkrshighal@gmail.com

Categories అవర్గీకృతం