పాడి పశువులలో బాహ్య పరాన్నజీవుల ఉపద్రవం – వాటి నియంత్రణ
పిడుదులు (పినుదులు) మరియు జోరీగలు
ఈ జాతికి చెందినవి. పాఠకుల సౌలభ్యం కోసము ఈ వ్యాసంలో పైన పేర్కొన్న అన్నింటినీ తవిటి జీవులు లేక క్రిములు అని వ్రాశాను. పాడి పశువుల శరీరము పైన చాలా రకములైన ఈ తవిటి జీవాలు వుంటాయి.
ఈగలు, దోమలు,పిడుదులు, జోరి గలు,పేలు,మరియు గోమార్లు ఈజాతికి చెందిన కొన్ని.వాటి పేరులో ఉన్నట్లే అవి పశువు చర్మమమున కు అతుక్కొని రక్తాన్ని పీల్చుతాయి.ఈ పరాన్న జీవులు పశువుల రక్తాన్ని పీల్చి జీవిస్తాయి. ఇవి ముఖ్యంగా పశువు చెవులకు లోపట బయట, తోక లోపల బయట ప్రదేశాలలో,మెడ భాగము మరియు గిట్టల ఒప్ మధ్య ప్రదేశాలలో నివసిస్తాయి. పశువు చర్మానికి అతుక్కొని వాటి రక్తాన్ని పీలుస్తుంటాయి.దాదాపు వివిధ జాతులకు చెందిన106 రకాలైన తవిటి జీవులు వున్నా యి.వాటిలో కొన్నింటి శాస్త్రీయ నామాలు lxodes, Amblyomma, Boophilus,Hyalomma, Rhipicephalusమరియు Dermacentor.
ఈ తవిటి క్రిములు వాటి జీవిత చక్రంలో పెద్దవి గాను లార్వా దశలోనూ పశువు శరీరాన్ని అంటిపెట్టుకొని వుండి ,ఆడవి మాత్రము పశువు శరీరము నుండి వేరుపడి నేలమీదకు వచ్చి పశుసాల గోడల మీద ,పగుళ్ళ లోన,సన్నటి చీలిక లోనూ గ్రుడ్లు పెట్టి అక్కడే అనిగి వుంటాయి. కొన్ని క్రిములు ఒక్కసారికి 500 నుండి 5000 వరకు గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్లు పగిలి లార్వా రూపంలో బయటకు వచ్చి ఆ పశువు మరియు యితర పశువుల శరీరము పైకి ప్రాకి చర్మము పై అంటిపెట్టుకొని వుంటాయి. మగవి మాత్రము ఎప్పుడూ పశువు చర్మానికి అతుక్కొని వుంటాయి. ఇవి సంవత్సర కాలమంతా పశువు శరీరాన్ని అంటిపెట్టు కొని వుండినా , సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మరియు పిబ్రవరి , మార్చి నెలల్లో పశువులు ఎక్కువగా వాటి బారిన పడతాయి.
పాడి పశవుల మీద ఈతవిటి జీవుల ఉపద్రవము వాటి ప్రభావము మరియు లక్షణములు
ఈ టిక్స్ పశువుల ఆరోగ్యము మీద రెండు విధాలుగా దెబ్బ తీస్తాయి.
a ప్రత్యక్ష ప్రభావం
b పరోక్ష ప్రభావం
a. ప్రత్యక్ష ప్రభావము మరియు లక్షణాలు
- టిక్సు పశువు శరీరము నుండి రక్తాన్ని పీల్చు కొంటాయి.దీని వనల పశువు శరీరములోని రక్తము తగ్గిపోయి,రక్త హీనత ఏర్పడి క్రమంగా బల హీన పడుతుంది.ఒక్కొక్కటి ఆవు శరీరమునుండి 0.5 ml నుండి 2.0 ml వరకు త్రాగుతాయి.
- . పశువులకు ఆకలి మందగిస్తుంది , నిస్తేజంగా తయారు అయుతాయి.
- పశువు చర్మము మీద దురద ఎక్కువగా వుండుట వలన , శరీరాన్ని రుద్దుకొని, మనశ్శాంతి లేక కొన్ని సమయాలలో చికాకుగా వుంటాయి.
- పశువు శరీర భాగము దెబ్బ తింటుంది. చర్మంపై వెంట్రుకలు రాలిపోతాయి.
- పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
- ఈ టిక్సు ఉపద్రవం చాలా ఎక్కువగా ఉంటే పశువు పునరుత్పత్తి సామర్థ్యం మీద ప్రభావం ఉంటుంది..
- వ్యవసాయ పశువుల సామర్థ్యం తగ్గి పనిచేయు శక్తిని కోల్పోతాయి.
b. పరోక్ష ప్రభావము లక్షణాలు
ఒక వైపు ఈ టిక్సు పశువుల రక్తాన్ని పీల్చడం వలన పశువులలో ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది.
ఇంకొక వైపు బాక్టీరియా, వైరస్,ప్రోటొజోవన్ పరాన్న జీవులు పశువు శరీరము లోనికి ప్రవేశించి స్పైరోకీట్స్, ఎంసెఫలిటిస్,తలీరియాసిస్, బబీసీసైజం మరియు అనాప్లోస్మూసిస్ లాంటి అంటు వ్యాధులు కలిగిస్తాయి .
పాడి పశువులలో ఈ పరాన్న జీవుల నివారణ
సాధారణంగా రసాయనిక క్రిమి సంహారక మందులు వాడి వీటిని నివారిస్తారు. ముఖ్యంగా synthetic organophosphorus మందులు ఎక్కువగా ఉపయో గిస్తారు. వీటి వాడకము వలన పెద్ద పరాన్న జీవులు నూరు శాతం చనిపోయినా వాటి గ్రుడ్లు గోశాలల గోడల మీద, పగుళ్ల లోనూ,నేల మీద అంటిపెట్టుకొని వుండి పోతాయి. అంతేకాక ఈ రసాయనాలు విషపూరితాలు కనుక అన్ని జాగ్రత్తలు సక్రమముగా పాటించి వాడవలెను.వీటి వాడకము పశువులలో కాన్సరు కారకము కావచ్చును. ఎక్కువ మోతాదులో పలుమార్లు వాడినచో ఈ తవిటి జీవులకు రోగనిరోధశక్తి వచ్చి మందులు పనిచేయక పోవచ్చును.కొన్ని రోజుల తర్వాత ఈ మందులు పూర్తిగా పనిచేయక పోవచ్చును.
ఈ సంహారక మందులలో కొన్ని ముఖ్యమైనవి pyrethroid ( cypermethrin and deltamethrin) మరియు organophosphorus ( hepthaphen,komaphos,fenvalerate ).
Deltamethrin మార్కెట్లో butox పేరుతో అందుబాటులో వున్నది. దీనిని పిచికారిగా కానీ ముంచు మందుగా కాని వాడవచ్చును. పశువులకు స్నానము చేయించుట కు butox మందును ఒక లీటరు నీటికి 2.0 ml , గోశాలల పరిసరాల్లోన .లోపల , నేలల మీద పిచికారి చేయుటకు ఒక లీటరు నీటిలో 5.0 ml మందును కలపాలి.ఈ మందులన్ని కూడ పశువులకు హానికరమైనవి. ఈ మందులను పశువులు నాకకుండా మూతులకు బుట్టలు అమర్చి జాగ్రత్తలు తీసుకోవాలి.మందు పిచికారికి ముందు జాగ్రత్తగా పశువులు శరీరాన్ని నాకకుండా ఉండుటకు పశువులను పూర్తిగా నీటిలో తడపాలి.
Ivermectin మరియు Doramectin అవుషదములు ఇంజక్షన్ మరియు గోళీల రూపముతో అందుపాటులో ఉన్నాయి. ఈ మందులు 50 కేజీ ల పశువు శరీర తూకమునకు 1.0 ml చొప్పున చర్మము క్రింద సూది రూపములో యివ్వాలి.Amitraz ద్రావకం
(TakTik) శరీరము మీద పూతగా లీటరు నీటికి 2.0ml కలిపి వాడవచ్చును. ఇదే విధంగా amitraz మరియు butox కలసిన మిశ్రమ మందు కూడ దొరుకుతుంది.
Fluemethrin మందును పిచికారిగాకాని ,ముంచుటకు కానీ వాడరాదు కానీ దీనిని పశువు శరీర పైబాగము చర్మము మీద తోక దగ్గర నుండి తల వరకు మరియు మెడకు ఇరువైపులా బ రెముకల వరకు పూతగా వాడవచ్చును.ఈ మందును వీపు పైన మర్దనా చేసినచో ,చర్మము లోనికి ఇంకి,చర్మము పై భాగము లోనికి చొరబడి కొద్ది కాలము వుంటుంది. ఈ Acaricides మనుష్యుల మీద పశువుల మీద మరియు వాతావరణం మీద ప్రభావము చూపుట వలన చాలా జాగ్రత్తగా వాడాలి. గోశాలలలో,పాకలలో వాడుచున్నప్పుడు చిన్నపిల్లలకు అందుబాటులో వుండరాదు. పురాతన సాంప్రదాయాలలో వాడుచున్న మూలికా (Ethnomedical/Ethno veterinary) మందులు ఈ తవిటి పురుగుల నివారణకు ప్రకృతి సిద్ధమైన వైద్యంగా అందుబాటులో ఉన్నవి .
ఈ మూలికా ఓషదులు , వేప,పొగాకు, సీతాఫలం, యూకలిప్టుస్,తేజ్ ఆకులు, పొదీన,వెల్లుల్లి మరియు దేవదారు మొక్కలనుండి తయారు చేయపడినవి.ఈ మందులు వాడినచో పశువులు ఈ తవిటి పురుగులనుండి నివారించబడి చక్కగా ఆరోగ్యవంతంగా తయారు అవుతాయి,మరియు రసాయన క్రిమిసంహారక మందులు వాడుట వలన వచ్చు దుష్ప్రభావాలు కూడ వుండవు. అంతే కాకుండా ఈ మందులు వాడిన పశువులతో చిన్న పిల్లలు , మనుష్యులు కలిసి తిరిగినా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా వుంటారు. శేవంతి (Cryzenthenum,,) మొక్క ఆకులు,పూల నుండి సేకరించిన pyrethrum అను హోమియోపతి మందు ఈ తవిటి పురుగుల నివారించుటకు చక్కగా పనిచేస్తుంది.
ఈ తవిటి క్రిములనుండి పశువుల రక్షణ
- పసుశాలల దగ్గరగా పెంటకుప్పలు లేకుండా చూడాలి.ఈ క్రిములు పెంటకుప్పల మీద,చీకటి ప్రదేశాలలో, క్రిక్కిరిసిన ప్రదేశాలలో గ్రుడ్లు పెడతాయి.కావున పసుశాలలను చాలా పరిశుభ్రంగా వుంచుట ముఖ్యమైన విషయము.
- పసుశాలల లోకి బాగా గాలి వెలుతురు వచ్చు ఏర్పాట్లు చేయాలి.
- పశువులకు సమగ్రమైన పుష్టికరమైన దానా ఇవ్వాలి.
- క్రొత్తగా వచ్చిన పశువులను రెండు వారములు వేరుగా వుంచి, ఈ తవిటి క్రిములు వునికిని గమనించాలి.
- పసుశాలలో ఉన్న పశువులను నీటి కుంటలు మరియు తటాకములలో దిగనియ్యరాదు.
Prof. K. M. L. పా థ క్
మాజీ డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ (జంతు శాస్త్రము) |
Dr. కుంజీలల్ రూపచంద్ శింఘాల్
మాజీ పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ ఉమ్మడి కమీషనర్ |